‘ఆచార్య’ టీజర్ రిలీజ్..!

మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన ‘ఆచార్య’ సినిమా టీజర్ విడుదలైంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చిరంజీవ 152వ చిత్రం.. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.


ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ కూడా రూపొందించారు కొరటాల శివ.. ‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు’ అని రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవుతుంది. ‘పాఠాలు చెప్పకపోయిన అందరూ ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అని చిరంజీవి చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 

 

Leave a Comment