‘హ్యాపీబర్త్ డే’ జక్కన్న.. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ విషెస్..

దర్శక ధీరుడు రాజమౌళి శనివారం తన 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. స్టూడెంట్ నెం.1 తో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి తన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తునే ఉన్నాడు. ఇప్పటి వరకు విజయాలే తప్పా.. పరాజయాలు ఎరుగలేదు. ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం 13వ సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బీజీగా ఉన్నారు. 

రాజమౌళి 1973 అక్టోబర్ 10న కర్ణాటకలోని రాయచూరులో జన్మించారు. సినిమాల్లో రాకముందు రాజమౌళి టీవీ సీరియళ్లకు పనిచేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా రాజమౌళికి శాభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళికి బర్త్ డే విషేస్ తెలిపారు. ‘విష్ యు ఏ వెరీ హ్యాపీ బర్త్ డే జక్కన్న. లవ్యూ’ అంటూ ట్వీట్ చేశారు.   

‘విమర్శకులతోనే ప్రశంసలు అందుకునే వ్యక్తి రాజమౌళి. నా గురువుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

Leave a Comment