రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనాకు కోర్టు ఝలక్..!

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనమవుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కోర్టు ఝలక్ ఇచ్చింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన వారిని ఉద్రవాదులతో పోల్చిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్నాటకలోని ఓ జ్యుడీషియల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు కాపీని కూడా అందించాలని క్యతాసంద్ర పోలీస్ అధికారులకు ఆదేశించింది. 

కాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని ఉగ్రవాదులుగా పోలుస్తూ సెప్టెంబర్ 21న కంగనా ట్వీట్ చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారే ఇప్పుడు రైతు బిల్లులపై కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి దేశంలో టెర్రర్ సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించింది.

కంగానా చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తుమకూరులోని ఎల్ రమేష్ నాయక్ అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాఖ్యలు రైతుల మనోభావాలను గాయపర్చేలా ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కంగనాపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.  

Leave a Comment