హ్యాపీ బర్త్ డే ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుక్రవారం 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అభిమానులైతే భారీగా, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ ఇప్పటి వరకు 19 సినిమాల్లో నటించారు.

 బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. శుక్రవారం చిత్రం యూనిట్ బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ విడుదల చేయనుంది.  

ఇక ప్రభాస్ కెరీర్ చేసుకుంటే..

  • 2002లో ఈశ్వర్ సినిమా చేశాడు. అది మంచి విజయం సొంతం చేసుకుంది. 
  • 2004లో వర్షం సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రభాస్ కు మంచి ఈమేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన అడవిరాముడు, ఛత్రపతి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 
  • 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ ను మార్చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు బద్దలకొట్టింది. ప్రభాస కు మాస్ హీరోగా పేరు తెచ్చిపెట్టింది.
  • ఇక ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి, యోగి, మున్నా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. 
  • తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమా మంచి విజయాన్ని సాధించింది. 
  • ఆ తర్వాత వచ్చిన బిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
  • ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు మంచి విజయం సాధించాయి.
  • అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు రికార్డులు బ్రేక్ చేశాయి. 
  • ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో యావరేజ్ గా నిలిచింది. 
  • ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. 

Leave a Comment