హనమంతుడి జన్మస్థలం తిరుమలే.. ఆధారాలు ప్రకటించిన టీటీడీ..!

హన్మంతుడి జన్మస్థలంపై టీడీపీ అధికారిక ప్రకటన వెలువరించింది. అంజనేయుడి జన్మస్థలం తిరుమలే అని నిర్ధారించింది. అంజనాద్రిపై ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని ఇందుకోసం నియమించిన కమిటీ తేల్చింది. దీనికి సంబంధించిన ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య మురళీధరశర్మ వెల్లడించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడిమాతో మాట్లాడుతూ తిరుమలలోని అంజనాద్రే హన్మంతుని జన్మస్థలం అని స్పష్టం చేశారు. ఆంజనేయుని జన్మస్థలంపై నిరూపించేందుకు నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించామన్నారు. వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని తెలిపారు. పౌరాణిక, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపారు. 

హన్మంతుడి జన్మస్థలం కర్ణాటకలోని హంపి కాదని మురళీధరశర్మ స్పష్టం చేశారు. హనుమ జన్మస్థలం హంపి కాదని చెప్పడానికి తమ వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. సూర్యబింబం కోసం హనుమ వేంకటగిరి నుంచే గాల్లోకి ఎగిరాడని, హనుమ తిరుమల కొండల్లోనే పుట్టాడని 12 పురాణాలు చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. 

 

Leave a Comment