విషాదం .. ఆక్సిజన్ లీక్.. 22 మంది మృతి..!

మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ లోని జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఘోర ప్రమదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు అందించేందుకు తీసుకొచ్చిన ఆక్సిజన్ ట్యాంక్ లీక్ కావడంతో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రి వెలుపల ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒక ట్యాంక్ నుంచి భారీగా ఆక్సిజన్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరింది. 

ఆక్సిజన్ ట్యాంక్ నుంచి పెద్ద ఎత్తున లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా తెల్లని గ్యాస్ వ్యాపించింది. అగ్నిమాపక దళ సిబ్బందిని తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆస్పత్రి అంతా భీతావహవాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఘటనతో ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై శీఘ్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు మహారాష్ట్ర మంత్రి రాజేష్ తోప్ తెలిపారు.    

Leave a Comment