ఈ కూరగాయలతో మీ పొట్ట తగ్గించుకోండి..!

ఈ రోజల్లో అధిక బరువుతో చాలా మంది బాధపడుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో తమ బరువును అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. అయితే బరువు పెరిగేటప్పుడు నియమాలు పాటించక.. పెరిగాక బరువు తగ్గేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇలా బరువు తగ్గాలి అని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. బరువు తగ్గడానికి సరైన ఆహారాన్ని ఎన్నుకోవాలి. ఆహారంలో కూరగాయలను వాడి శరీరంలో కొవ్వును తగ్గించుకోవచ్చు..

కొవ్వును తగ్గించే కూరగాయలు:

  • కొవ్వును కరిగించేందుకు గుమ్మడి కాయ బాగా ఉపయోగపడుతుంది. మంచి గుమ్మడితో కూర చేసుకుని తినడం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఫలితాలనిస్తుంది. 
  • ఆహారంలో పచ్చి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
  • కాలీఫ్లవర్, క్యాబేజీలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలో ఉండే పీచు పదార్థాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యంగా అరికడతాయి. 
  • అదే విధంగా వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులు తీసుకోవడం కూడా కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజనంను బాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది. 
  • ఎక్కువ మోతాదులో ఆకుకూరలు తీసుకోవడమూ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది. 

Leave a Comment