పంట పొలంలో దుర్గమ్మ..!

పచ్చటి వరిచేలో దుర్గమ్మ తల్లి దర్శనమిచ్చింది. గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన రైతు పాపారావు అద్బుతమైన ఆవిష్కరణ ఇది. పాపారావు తన పొలంలో వెద పద్ధతిలో వరి వేశాడు. వరినారులో ఆయన దుర్గమ్మ అమ్మవారిని తీర్చిదిద్దాడు. అంతే కాదు పాపారావు ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలోనూ వరినారుతో గోవింద నామాలు, గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ ఆకృతిని తమ పొలంలో రూపొందించారు. 

పాపారావు జపాన్ లో విశేష ఆదరణ పొందిన ప్యాడీ ఆర్ట్ ను ఆదర్శంగా తీసుకున్నాడు. జపాన్ లో వ్యవసాయ క్షేత్రాలను కళాత్మక ప్యాడీ ఆర్ట్ తో అలంకరిస్తారు. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అలాంటి ప్యాడీ ఆర్ట్ కు చూసేందుకు సందర్శకులు వస్తుంటారు. ఆ తరహాలోనే అత్తోట గ్రామ వ్యవసాయ క్షేత్రాలు, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను చాటే విధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రైతు పాపారావు తెలిపారు. 

Leave a Comment