14 ఏళ్ల బాలుడితో మహిళ పరారీ..హైదరాబాద్ లో సహజీవనం..!

ఆమెకు 31 ఏళ్లు.. పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉండటం లేదు.. ఏమైందో కానీ.. ఎదురింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడిపై మనసు పడింది.. ముందుగా ఆ బాలుడిని పరిచయం చేసుకుని అతడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది.. అతనికి మాయమాటలు చెప్పి ఈ వయసులో చేయకూడని పనులన్నీ చేయించింది.. ఆ తర్వాత బాలుడిని తీసుకొని హైదరాబాద్ కు పరారీ అయ్యింది.. అక్కడ బాలుడితో సహజీవనం చేసింది.. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 31 ఏళ్ల వివాహిత మహిళ స్థానికంగా ఉండే పిల్లలతో నిత్యం సెల్ ఫోన్ లో హౌసీ గేమ్ ఆడుతూ ఉండేది.. ఈ సమయంలో ఆమె ఎదురింట్లో నివాసం ఉండే 14 ఏళ్ల బాలుడు ఆ మహిళ పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరి మధ్య కొద్ది రోజులకు చనువు పెరిగింది. దీంతో ఆ బాలుడికి ఫోన్లో వీడియోలు చూపించిన ప్రలోభపెట్టి.. శారీరకంగా లొంగదీసుకుంది. 

బాలుడు స్థానిక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆ మహిళతో సంబంధం కారణంగా బాలుడు స్కూల్ కి సరిగ్గా వెళ్లేవాడు కాదు.. ఆమె ఇంటికి తరచూ వెళ్లడాన్ని గమనించిన బాలుడి తల్లిదండ్రులు పలుమార్లు మందిలించారు. తల్లిదండ్రులు మందించిన విషయాన్ని బాలుడు ఆ మహిళతో చెప్పాడు. దీంతో ఆమె బాలుడు తనకు దూరమవుతాడని భావించింది.. 

బాలుడికి మాయమాటలు చెప్పి ఈనెల 19న బలవంతంగా హైదరాబాద్ తీసుకెళ్లింది.. వివాహితపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ఫోన్ కాల్ డేటా, సిగ్నల్స్ ను విశ్లేషించిన పోలీసులు.. ఇద్దరి ఫొటోలతో గాలించారు.. చివరికి హైదరాబాద్ బాలానగర్ లోని ఓ గదిలో బాలుడితో పాటు మహిళ ఉన్నట్లు గుర్తించారు. 

వెంటనే అక్కడికి వెళ్లి ఆమెతో పాటు బాలుడిని గుడివాడ తీసుకొచ్చారు. వైద్యపరీక్షల అనంతరం బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా.. విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. బాలుడితో కలిసి శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో మాయమాలు చెప్పి తీసుకెళ్లినట్లు అంగీకరించింది. దీంతో ఆమెపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.. 

 

  

 

Leave a Comment