Video Viral: కబడ్డీ ఆడుతూ..ప్రాణాలు కోల్పోయిన యువకుడు..!

కబడ్డీ పోటీల్లో విషాదం జరిగింది. ‘భీమిలీ కబడ్డీ జట్టు’ సినిమాలో నాని ప్రాణాలు వదిలినట్లు ఓ యువకుడు కబడ్డీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడలూరు ఏరియాలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విమల్ రాజ్ అనే యువకుడు పాల్గొన్నాడు.. 

మ్యాచ్ మధ్యలో విమల్ రాజ్ కూతకు వెళ్లాడు.. ప్రత్యేర్థి ఆటగాళ్లపై నుంచి ఎగిరి గీత దగ్గరికి వచ్చాడు.. ఈక్రమంలో ప్రత్యర్థి జట్టు ఆటగాడు విమల్ రాజ్ మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈప్రయత్నంలో ఆ ఆటగాడి మోకాలు, విమల్ రాజ్ ఛాతీపై బలంగా తగిలింది.. ఆ తర్వాత పైకి లేచేందుకు ప్రయత్నించిన విమల్ రాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.. 

మిగిలిన ఆటాగాళ్లు, రఫరీ విమల్ రాజ్ ని లేపేందుకు ప్రయత్నించినా.. లేవకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యంలో విమల్ రాజ్ ప్రాణాలు కోల్పోయాడు.. కబడ్డీ ఆడుతున్న సమయంలో గుండెపోటు రావడంతో విమల్ రాజ్ చనిపోయి ఉండొచ్చని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Leave a Comment