ఒకే సిరంజీతతో 30 మంది విద్యార్థులకు టీకా వేశాడు..!

ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా వేశాడు ఓ వ్యాక్సినేటర్.. దీనిపై ప్రశ్నిస్తే.. తన తప్పేమి లేదని, పై అధికారులకు తనకు ఒకటే సిరంజీ పంపించారని చెప్పాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ నగరంలో ఉన్న జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చోటుచేసుకుంది.. 

వివరాల మేరకు.. స్కూల్ లో ఇటీవల కరోనా టీకా పంపిణీ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ 30 మంది విద్యార్థులక ఒకే సిరంజీతో టీకాలు వేశాడు.. దీనిని గుర్తించి తల్లిదండ్రులు.. వ్యాక్సినేటర్ ని ప్రశ్నించారు.. 

వ్యాక్సిన్ మెటీరియల్ తీసుకొచ్చిన వ్యక్తి ఒకే సిరంజీ డెలివరీ చేశాడని వ్యాక్సినేటర్ జితెంద్ర తెలిపాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లానని, ఒకే సిరంజీతో అందరికీ టీకాలు వేయామంటారా అని అడిగితే సరే అన్నారని పేర్కొన్నాడు. ఇందులో తన తప్పేమి లేదని, వాళ్లు చెప్పిందే తాను చేశానని సమాధానం ఇచ్చాడు.. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు విచారణ చేస్తున్నారు..  

 

 

Leave a Comment