మేయర్ పీఠమెక్కిన తొలి దళిత మహిళ..!

తమిళనాడులో రాాజధాని చెన్నై నగరపాలక సంస్థ మేయర్ గా తొలిసాారిగా ఓ దళిత మహిళ ఎన్నికయ్యారు. చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం సాధించిన 28 ఏళ్ల ఆర్.ప్రియను ఈ పదవికి డీఎంకే నామినేట్ చేసింది. శుక్రవారం ప్రియ మేయర్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ పీఠాన్ని అలంకరించిన తొలి దళిత వ్యక్తిగానే కాకుండా అతి పిన్న వయస్కురాలిగానూ, మూడో మహిళగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. 

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో నార్త్ చెన్నూరులోని తిరువికా నగర్ కి చెందిన ప్రియ 74వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలుపొందారు. మొత్తం 200 వార్డులకు గానూ.. డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. కాగా గతంలో తారా చెరియన్, కామాక్షి జయరామన్ లు చెన్నైకి మహిళా మేయర్లుగా పనిచేశారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన ప్రయి మూడో మహిళగా నిలిచారు. దీంతో తొలి దళిత మహిళగా, అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు.. 

Leave a Comment