రాత్రిపూట గోర్లు కట్ చేస్తున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!

రాత్రి పూట గోర్లు కట్ చేయకూడదని మనం తరచూ వింటుంటాం.. మన పెద్దలు కూడా రాత్రి సమయంలో గోర్లు కత్తిరించవద్దని మందలిస్తుంటారు. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రాత్రి గోర్లు కట్ చేస్తే ఏమవుతుంది? అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతోంది.. నిజానికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం కష్టమే.. కానీ అలా కత్తిరించకూడదనడానికి కొన్ని కారణాలు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే..

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం.. మన గోర్లలో కెరాటిన్ అనే పదార్థం ఉంటుంది. అందుకే గోళ్లను ఎప్పుడూ స్నానం చేసిన తర్వాత కట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే స్నానం చేసినప్పుడు మన గోర్లు నీటిలో లేదా సబ్బు నీటిలో నాని మెత్తగా ఉంటాయి. దీంతో గోర్లు తేలికగా కట్ అవుతాయి. 

ఇక గోర్లను రాత్రి పూట కట్ చేస్తే అవి గట్టిగా ఉంటాయి. అప్పుడు కట్ చేసేందుకు ఇబ్బంది అవుతుంది. అంతేకాదు గోర్లు గట్టిగా ఉన్నప్పుడు కట్ చేస్తే అవి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక రాత్రి పూట గోర్లు కట్ చేయకూడదనడానికి మరో కారణం కూడా ఉంది. అప్పట్లో ప్రజల వద్ద నెయిల్ కట్టర్లు లేవు. ఆ రోజుల్లో కత్తితో కానీ, పదునైన పనిముట్లతో కానీ కట్ చేసేవారు. అప్పట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. అందుకోసం పెద్దలు చీకట్లో గోర్లు కట్ చేయకూడదని చెప్పేవారు. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మూఢనమ్మకాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. కొంత మంది వీటిని ఇప్పటికీ నమ్ముతూ వస్తున్నారు. పిల్లలను కూడా అనుసరించాలని ఒత్తిడి చేస్తున్నారు. 

సరైన మార్గం ఇదే:

  • గోర్లను కత్తిరించడానకి ముందు మీ గోళ్లను తేలకపాటి నూనెలో లేదా నీటిలో పెట్టాలి. 
  • ఇలా చేస్తే గోర్లు మృదువుగా అవుతాయి.
  • అప్పుడు గోర్లను బాగా కత్తిరించవచ్చు. 
  • గోర్లు కత్తిరించిన తర్వాత కూడా చేతివేళ్లని నీటితో కడగాలి. వాటిపై మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకుంటే గోర్లు ఎప్పుడు అందంగా ఉంటాయి. 

 

Leave a Comment