యూట్యూబ్ కొందరికి ఉపాధి ఇస్తోంది.. మరి కొందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది.. కొందరిని సెలబ్రెటీలుగా మార్చేస్తోంది.. కొందరు ఉద్యోగాలను సైతం వదిలేసి యూట్యూబ్ ని తమ కెరీర్ గా చేసుకుంటున్నారు. తమకున్న నైపుణ్యంతో వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక కొంత మంది నటనతో యూట్యూబ్ లో తమ టాలెంట్ చూపిస్తున్నారు. అలా చేస్తున్న వీడియోలతో యూట్యూబ్ లో మన యూట్యూబర్లు రూ.6,800 కోట్లు సంపాదించారరు.
ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ అనే కన్సల్టింగ్ సంస్థ 2020 సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని వెల్లడించింది. అంతేకాదు ఇండియాలో యూట్యూబ్ ప్రభావం ఆర్థికంగానూ, సామాజికంగానూ, కల్చరర్ గా ఎలా ఉందనే అంశాలను ఈ సంస్థ స్టడీ చేసింది. యూట్యూబ్ వల్ల మన జీడీపీకి రూ.6800 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా 6,83,900 ఫుల్ టైమ్ జాబ్స్ ని సైతం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది.
యూట్యూబ్ ద్వారా వచ్చిన రెవెన్యూలో అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూతో పాటు సబ్ స్క్రిప్షన్స్, ఇతర మార్గాలలో మానిటైజేషన్ వంటి వాటినీ లెక్కలోకి తీసుకున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. మన దేశంలో లక్ష కంటే ఎక్కవ సబ్ స్కైబర్లతో 40 వేల ఛానెల్స్ ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఈ ఛానెళ్లు ఏడాదికి 45 శాతం కంటే ఎక్కువ వృద్ధి సాధిస్తున్నాయట.. యూట్యూబ్ క్రియేటర్స్ తమ కంటెంట్ తో డబ్బులు సంపాదించేందుకు 8 మార్గాలను పొందుపరిచారట. వీటిని ఉపయోగించుకుంటూ కనీసం లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే ఛానెల్స్ సంఖ్య ఏడాదికి 60 శాతం పైగా పెరిగినట్లు రిపోర్టులో తెలిపింది.