19 ఏళ్ల యువతితో తాత జంప్..!

గుజరాత్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతి తన పొరుగింటి తాతతో లేచిపోయింది. అయితే ఈ విషయంలో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. 

గత నెల 2వ తేదీన యువతి కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో పొరుగింటి తాత షోవాంజీ ఠాకూర్ తమ అమ్మాయిని తీసుకెళ్లాడని అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతికి 19 ఏళ్లు కాబట్టి మైనారిటీ తీరిందని పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పొరుగింటి తాత షోవాంజీ ఠాకూర్ తన సోదరిని బలవంతంగా తీసుకెళ్లి నిర్బంధించాడని, పోలీసులు ఈ కేసును సాధారణంగా తీసుకున్నారని యువతి సోదరుడు పేర్కొన్నాడు. 

ఈ కేసు గత నెల 22న విచారణకు వచ్చింది. ఠాకూర్ పెద్ద కూతురికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. యువతిని గాలించి కోర్టు ఎదుట హాజరుపరచాలని పోలీసులను ఆదేశించాలని కోరారు. కేసును విచారించిన కోర్టు జూన్ 29న యువతిని హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. యువతనికి వెతికి  పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమకు కొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో ఈనెల 13 వరకు కోర్టు పోలీసులకు సమయం ఇచ్చింది. 

Leave a Comment