బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు కరోనా..!

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన చికిత్స కోసం ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేరారు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణఅయింది. అంతకుముందు ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘నేకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హాస్పిటల్ లో చేరాను. ఆస్పత్రి అధికారులు నా కుటుంబ సభ్యులను కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాము. గత 10 రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి’ అంటూ అభ్యర్థించారు. 

అభిషేక్ బచ్చన్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ మా ఇద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాము. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని ట్విట్ చేశారు. అయితే బచ్చన్ ఫ్యామిలీలో అందరినీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా..జయ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యకు నెగిటివ్ అని నిర్ధారణ అయింది. 

 

Leave a Comment