ఆడపిల్ల ఉంటే రూ.24 వేలు..నిజమేనా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం..ఆడపిల్లలకు అద్భుతమైన పథకం. ఒక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.24,000 ఇస్తుంది. అంటూ ఒక వార్త ఫేస్ బుక్, వాట్సాప్ లలో తెగ తిరుగుతోంది.  ఇక దానికి సంబంధించి అర్హతలు, ఎక్కడ నమోదు చేసుకోవాలో కూడా అందులో ఉంది. అయితే ఈ చక్కర్లు కొడుతున్న వార్త నిజమేనా? అసలు అలాంటి పథకం ఉందా? ఇవేమీ పట్టించుకోకుండా మన నెటిజన్లు కూడా ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు. 

నిజానికి ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో ఎలాంటి పథకం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం గురించి ఎప్పుడు చెప్పలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ తప్పుడు వార్త గురించి ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) కూడా ఖండించింది. ఇలాంటి తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ప్రజలు కూడా ఇలాంటి  పథకాలు ఉన్నాయా? లేదా? అని నిర్ధారించుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు..

Leave a Comment