అమెజాన్ నుంచి గుడ్ న్యూస్..

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం Amazon భారత దేశంలో తొలిసారిగా స్విగ్గి, జోమాటోలకు పోటీ ఇవ్వనుంది. Amazon కొత్తగా ఆహార పంపిణీ సేవను ప్రారంభించింది. మొదటగా ఈ సేవలను బెంగళూరులో మొదలు పెట్టింది. స్థానిక రెస్టారెంట్లు మరియు క్లౌడ్ కిచెన్ల నుంచి తయారు చేసిన ఫుడ్ ను వినియోగదారులకు ఆర్డర్ చేయడానికి అనుమతిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణణంగా ప్రజలు బయటి ఫుడ్ పై ఇంట్రస్ట్ చూపడం లేదు. అయితే ఆహారం విషయంలో భద్రత మరియు అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉందని Amazon కంపెనీ పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్న రెస్టారెంట్లకు సహాయం చేసే ఉద్దేశంతో ఈ సేవను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

 ప్రస్తుతం బెంగళూరుకు పరిమితమైన తమ సేవలు క్రమంగా అన్ని నగరాలకు విస్తరిస్తామని Amazon ప్రతినిధి తెలిపారు. కరోనా ప్రభావంతో స్విగ్గీ తన సిబ్బందిని తొలగించడంతో పాటు, క్లౌడ్ కిచెన్స్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Leave a Comment