గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది..

కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బయోఫార్మా సంస్థ అస్ట్రాజెనెకా గుడ్ న్యూస్ తెలిపింది. సెప్టెంబర్ లోనే తొలి విడత వ్యాక్సిన్ సరఫరాలను చేపడతామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధి, తయరీ, సరఫరా కోసం అమెరికన్ బయోమెడికల్ పరిశోధన అభివృద్ధి సంస్థ నుంచి తమకు వంద కోట్ల డాలర్ల నిధులు మంజూరైనట్లు ప్రకటించింది. 

corona (covid -19) Vaccine in india

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కు పూర్తిగా సహకరిస్తామని, మూడో దశ పరీక్షలకు పరిశోధనలకు సహకరిస్తామని సంస్థ పేర్కొంది. 40 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదిరింది. 30,000 మందిపై వ్యాక్సిన్ పై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారని సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ ను త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో తాము కలిసి పనిచేస్తామని కంపెనీ వెల్లడించింది. 

Leave a Comment