టిక్ టాక్ ప్రియులకు గుడ్ న్యూస్..

టిక్ టాక ప్రియులకు ఇన్ స్టాగ్రామ్ గుడ్ న్యూస్ అందించింది. టిక్ టాక్ ద్వారా ఇండియాలో చాలా మంది స్టార్స్ అయ్యారు. టిక్ టాక్ నిషేధంతోె వారు తమ లక్షల మంది ఫాలోవర్స్ ను కోల్పోయారు. ఈ సదవకాశాన్ని ఇన్ స్టాగ్రామ్ ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. టిక్ టాక్ యొక్క భారీ యూజర్లను తనవైపు మళ్లీంచుకోవాని చూస్తోంది. టిక్ టాక్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పేరుతో ఒక చిన్న వీడియో మేకింగ్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నాయి. దీని కోసం బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు ఇండియాలోనూ చాలా మంది కంటెన్ట్ రైటర్ల నుంచి ఇన్ స్టాగ్రామ్ సూచనలు తీసుకుంటుంది. ఇండియాలో ప్రముఖ టిక్ టాక్ స్టార్లను తమ వీడియోలో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయాలని కోరింది. 

ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ఎలా ఉపయోగించాలి..

  • ఇన్ స్టాగ్రామ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • ఇన్ స్టాగ్రామ్ లోని ‘కెమెరా’ ఆప్షన్ వద్ద వెళ్లాలి.
  • స్కీన్ దిగువన ‘రీల్స్’ ను క్లిక్ చేయాలి. 
  • ఇక మీ వీడియోను సులభంగా రికార్డ్ మరియు ఎడిట్ చేయవచ్చు. 
  • ఇన్ స్టాగ్రామ్ రీల్ లో కూడా టిక్ టాక్ మాదిరిగానే బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్, డైలాగ్స్ వస్తాయి. మనకు కావాల్సిన ఎఫెక్ట్స్, సౌండ్స్ ఉపయోగించుకోవచ్చు. 

 

 

Leave a Comment