2021 నాటికి దేశంలో రోజుకు 2.8 లక్షల మందికి కరోనా ..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇక కరోనా కట్టడికి ఆయా దేశాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి. అయితే ఎలాంటి ఉపయోగం లేకపోయింది. వైరస్ తీవ్రరూపం దాల్చుతూనే ఉంది. ఇక కరోనా మహమ్మారిని కట్టడి చేయలేకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. ఇక ముందు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం నమోదవుతున్న వాటి కంటే 12 రెట్టు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ (ఎంఐటీ) శాస్త్రవేత్తులు హెచ్చరిస్తున్నారు. మరణాలు కూడా 50 శాతం అధికంగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. 

ఇదే విధంగా కరోనా కేసులు వస్తే 2021 నాటికి ప్రపంచంలో 25 కోట్ల మందికి కరోనా వైరస్ సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 18 లక్షల మంది కరోనాతో మరణించే అవకాశం ఉందన్నారు. భారతదేశంలోనూ రోజుకు 2.8 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికాలో రోజుకు 95,000, దక్షిణాఫ్రికాలో 21,000, ఇరాన్ లో 17,000 కేసులు నమోదు కావచ్చని ఎంఐటీ శాస్త్రవేత్తలు. అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని 84 దేశాల్లో ఉన్న 4.75 బిలియన్ల జనాభా సమాచారాన్ని పరిశీలించి ఈ గణాంకాలన వారు చెప్పారు. 

Leave a Comment