కరోనా బిల్లులపై  మహిళా డాక్టర్ ఆవేదన..

కరోనా కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుఅదుపులేకుండా పోతోంది. ఇటీవల ఫీవర్ ఆస్పత్రి డీఎంఓకు అధిక ఫీజులు వేసి నర్బంధించగా..ఇప్పుడు మరో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. ఓ మహిళా డాక్టర్ కూడా అధిక ఫీజులు వేసి షాక్ ఇచ్చింది హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్. కరోనా పేరుతో చేయని చికిత్సకు బిల్లులు వేసి వేధిస్తున్నరంటూ విజయకేసరి అనే మహిళా డాక్టర్ సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి తమను ఆదుకోవాలని కోరింది. 

సెల్ఫీ వీడియోలో ఆమె ఏం మాట్లాడారంటే.. ‘నా నాన్నకు అనారోగ్యంగా ఉండటంతో ఇటీవల ఏఐజీలో చేరారు. ఇక్కడ చేరాక నాకు, నాన్నకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. మాకు ఒక్క లక్షణం కూడా లేదు. అయినా పాజిటివ్ అని వచ్చింది. ఇప్పటి వరకు వెంటిలేటర్, ఆక్సిజన్ పెట్టలేదు. ఎటువంటి చికిత్స చేయలేదు. ఒక్క ఇంజక్షన్ వేయలేదు. సీ విటమిన్, యాంటిబయోటిక్ మాత్రమే ఇచ్చారు. అయినా చేయని చికిత్సకు భారీగా బిల్లు వేశారు. నేను ఆస్పత్రి వారిని ప్రశ్నిస్తే హడావుడిగా డిశ్చార్జ్ చేయాలని చూస్తున్నారు.అధిక ఛార్జీలు వేసి మమ్మల్ని చాలా సతాయిస్తున్నారు. ఇండియాలో ఇంత ఫ్రాడా ? ఇంత ఘోరమా? వచ్చిన పేషంట్లను బాగు చేసి పంపియాల్సింది పోయి వేధిస్తున్నారు..ఈ సమస్య నుంచి బయటపడేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని కన్నీటి పర్యంతమయ్యారు. 

Leave a Comment