భారత్-చైనా ఘర్షణపై 19న ఆల్ పార్టీ మీటింగ్..

భారత్ – చైనా మధ్య చేటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాతావారణం వేడెక్కింది. గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త  నెలకొంది. 

ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అధినేలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం పంపారు. ఈ భేటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. 

గత కొద్ది రోజులుగా లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో భారత సైనికులే కాకుండా చైనా సైనికులు 43 మంది మరణించినట్లు సమాచారం. అయితే చైనా దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. పెద్ద సంఖ్యలో సైనికులు గాయపడినట్లు పేర్కొంది. 

 

Leave a Comment