బంపర్ ఆఫర్.. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే, ముక్కు పుడక, హ్యాండ్ బ్లెండర్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. అయితే వ్యాక్సిన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణపాయం అనే భావనలో ఉన్నారు. దీంతో వ్యాక్సిన్ వేసుకుందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. 

ఈనేపథ్యంలో గుజరాత్ లోని స్వర్ణకారుల సంఘం వినూత్న ఆఫర్ ఇచ్చి కోవిడ్ టీకా వేసుకునేందుక ప్రోత్సహిస్తోంది. టీకా వేసుకున్న వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. టీకా వేసుకున్న మహిళలకు బంగారు ముక్కు పుడకడలను, పురుషులకు హ్యాండ్ బ్లెండర్లు, ఇతర వంటింటి సామాత్రిని బహుమతిగా అందజేస్తోంది. రాజ్ కోట్ లోని టీకా కేంద్రంలో స్వర్ణకారుల సంఘం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీరి ప్రయాత్నాన్ని ప్రముఖులు, ప్రజలు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

Leave a Comment