అయోధ్య రామాలయానికి మొఘల్ వంశం నుంచి కానుక..!

అయోధ్య రామాలయం నిర్మాణానికి మొఘల్ వంశ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ టుసీ బంగారు ఇటుకను కానుకగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక కిలో బరువున్న బంగారు ఇటుకను ప్రధాని మోడీకి అందించనున్నారు. ఈ ఇటుకను ఆలయ నిర్మాణంలో వాడాలని కోరారు.100 కోట్లకుపైగా హిందువుల విశ్వాసం మరియు భావోద్వేగాలతో కూడిన సమస్య స్నేహపూర్వకంగా పరిష్కరించబడటం సంతోషకరమైన విషయం అని టుసీ అన్నారు. 

భారత దేశంలోని హిందూ సోదరులకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తాను వాగ్దానం చేసినట్లుగా ఒక కిలో బంగారు ఇటుకను ప్రధాని మోడీకి అందిస్తానని, అందుకు ప్రధానిని సమయం ఇవ్వాలని కోరానని తెలిపారు. కాగా ఆగస్టు 15న మధ్యాహ్నం 12.15 గంటలకు ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయాాలని భావిస్తున్నారు.   

Leave a Comment