ఇలాంటి అబ్బాయిలంటేనే.. అమ్మాయిలకు ఇష్టమట..!

అమ్మాయిల మనసత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం.. అమ్మాయిలు ఏం కోరుకుంటారనే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు కూడా.. వారు కూడా తమ మనసులోనీ భావాలను ఎవరితోనూ షేర్ చేసుకోరు. అమ్మాయిలు ఎంత క్లారిటీగా ఉంటారంటే.. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారితో స్నేహం కూడా చేయరు. 

అంతేకాదు అమ్మాయిలు వారికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచుతారు. అమ్మాయితో ఫ్రెండ్ షిప్ చేయాలని అనుకుంటే ముందుగా వారి మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడే వారితో స్నేహం అనేది బలంగా ఉంటుంది. ఇక అమ్మాయిలు అబ్బాయిల గురించి ఏం ఆలోచిస్తారు.. వారి మనసులోని మాటలను ఎవరితో షేర్ చేసుకుంటారు.. ఎలాంటి అబ్బాయిలు అయితే అమ్మాయిలకు ఇష్టమో ఓ నివేదిక ఈ విధంగా తెలియజేసింది.. 

  • అమ్మాయిల కళ్లలో చూస్తూ మాట్లాడే అబ్బాయిలను ఇష్టపడతారట. అలాంటి అబ్బాయిలు ఎంతో నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారట. నేలవైపు చూస్తూ మాట్లాడే అబ్బాయిలు.. చుట్టు పక్కల చూస్తూ మాట్లాడే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరట.. 
  • అమ్మాయిలకు సర్ ప్రైజ్ చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టమట.. కానీ ఈ విషయాలను అమ్మాయిలు బయటపెట్టరట. ప్రేయసి, భార్య, సోదరి ఎవరైనా సరే సర్ ప్రైజ్ ఇష్టపడతారట. అబ్బాయిలతో బాండింగ్ బాగా ఉండాలంటే.. వారికి అప్పుడప్పుడు సర్ ప్రైజ్ ఇస్తుండాలట.. అవి చిన్న చిన్న గిఫ్ట్స్ అయినే సరే.. 
  • ఇక అమ్మాయిలను జడ్జ్ చేసే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు. వారికి రూల్స్ పెట్టడం, చేసే ప్రతి పనికి అడ్డు చెప్పే అబ్బాయిలంటే నచ్చరట.. 
  • ఎప్పుడు హ్యాపీగా.. జాయ్ ఫుల్ గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఇష్టమట. ఎప్పుడూ విచారంగా తమ కష్టాలను చెప్పుకునే అబ్బాయిలంటే ఇష్టం ఉండదట. ఒకవేళ మీకు అలాంటి స్వభావం ఉంటే వెంటనే మార్చుకోండి.. అమ్మాయిలు ఫన్నీగా.. సంతోషంగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారట.. 
  • ఎప్పుడూ గౌరవంగా మాట్లాడే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. అమ్మాయిలు ఈ విషయాన్ని బయటకు చెప్పరట.. గౌరవంగా మాట్లాడే విషయంలో అబ్బాయిలను వారు గమనిస్తుంటారట.
  • అమ్మాయిలు ఎప్పుడూ తమకు రక్షణగా ఉండే అబ్బాయిలంటే ఇష్టపడతారు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలనుకుంటారు. అమ్మాయిలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి కాస్త భరోసా ఇచ్చారంటే చాలా ఆ అమ్మాయి తన జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో దాచుకుంటుందట..  

Leave a Comment