నంద్యాలలో ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రేయసి..!

మనం ఎప్పుడూ ఆడవారిపై మగాళ్లు యాసిడ్ దాడి చేయడం చూశాం…ప్రేయసి మోసం చేసిందనో లేక వేరే పెళ్లి చేసుకుందనో ప్రియుడు..ప్రియురాలిపై దాడులు చేస్తుంటారు. సినిమాల్లో కూడా ఇలాంటివే ఎక్కువ చూపిస్తుంటారు..కానీ ఒక అమ్మాయిని మోసం చేస్తే ఎలా ఉంటుందో చూపించింది ఓ ప్రేయసి…తనను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది..ఈ ఘటనత కర్నూలు జిల్లాలోని నంద్యాలలో గురువారం చోటుచేసుకుంది. 

నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర, సుప్రియ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి కులాలు వేరు..దీంతో నాగేంద్ర పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ఆమెను కాదన్నాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తట్టుకోలేపోయిన సుప్రియ నాగేంద్రపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో నాగేంద్ర ముఖం, చెయ్యి కాలిపోయాయి. ప్రస్తుతం నాగేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తనను మోసం చేసింది కాక తిరిగి తనతో ప్రేమగా ఉండాలని వేధించడంతోనే యాసిడ్ పోశానని సుప్రియ చెప్పింది. 

You might also like
Leave A Reply

Your email address will not be published.