ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో ఆన్ లైన్ రమ్మీపై నిషేధం..!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజాలో చెడు ధోరణిలకు కారణమవుతున్న రమ్మీ, పోకర్ వంటి ఆన్ లైన్ గేమ్స్ ను నిషేధించింది. దీనికి సంబంధించి ఏపీ గేమింగ్ యాక్ట్ – 1974 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి శిక్షలను ఖరారు చేసింది. 

  • ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ పట్టుబడితే 6 నెలల శిక్ష
  • దీనిని ప్రోత్సహిస్తున్న నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష
  • రెండో సారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా..

ఆన్ లైన్ గేమ్స్ వల్ల యువత బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతే కాదు భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంతో ఆన్ లైన్ రమ్మీని నిషేధించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో సమావేశంలో చర్చించి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధించింది. 

Leave a Comment