వరదలోనూ వీడని పట్టుదలకు సెల్యూట్ .. పడవలో స్కూల్ కు వెళ్లిన బాలిక..!

వర్షం పడితే చాలు స్కూలుకు వెళ్లమని పిల్లలు మారం చేస్తుంటారు. అదే వరదలు వచ్చి రోడ్లపై నీరు ఉంటే ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టరు.  కానీ ఈ బాలిక పట్టుదల చూస్తూ సెల్యూట్ చేయాల్సిందే.. వరద నీటిలోనూ పడవ నడుపుకుంటూ పాఠశాలకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అమ్మాయి పడవ నడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. గోరఖ్ పూర్ లోని బహ్రంపూర్ ప్రాంతంలోని బ్యాంక్ రోడ్డులోని అయోధ్య దాస్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలో సంధ్య సహానీ అనే అమ్మాయి 11వ  తరగతి చదువుతోంది. తరగతులకు హాజరయ్యేందుకు ఆమె పడవపై స్కూలుకు చేరుకుంది. 

‘కరోనా సమయంలో తన వద్ద స్మార్ట్ ఫోన్ లేక ఆన్ లైన్ క్లాసులను కోల్పోయాను. అయితే వరదల కారణంగా నేను తరగతులు మిస్ కాకూడదని అనుకున్నా.. ఎలాగైనా స్కూల్ కు చేరుకోవాలనుకున్నాను. కాబట్టి పడవ ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నాను.’ అని సంధ్య చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ విద్యార్థి చేసిన పనికి కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి కొందరు విమర్శిస్తున్నారు. నాటకాలు చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదీ ఏమైనా తన విద్య కొనసాగించడానికి అమ్మాయి చూపిన ధైర్యానికి ప్రశంసిచాల్సిందే.. 

Leave a Comment