ఏపీలో బాదుడే బాదుడు.. చిన్న హోటల్ కు రూ.21 కోట్ల కరెంట్ బిల్..!

కరెంట్ బిల్లలు కాస్త ఎక్కువ వస్తేనే కంగారు పడిపోతాం.. కాని కోట్ల రూపాయాల్లో బిల్లు వస్తే.. వింటేనే గుండె ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదూ..కానీ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఓ చిన్ని హోటల్ కు అక్షరాల 21 కోట్ల 48 లక్షల 62 వేల 224 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఏపీ విద్యుత్ శాఖ ఇచ్చిన ఈ బిల్లును చూసి ఆ హోటల్ నిర్వాహకులు షాక్ లో ఉన్నారు..

చింతలపూడిలో సాయి నాగమణి ఓ టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. ఈ హోటల్ కు ఆగస్టు నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ సారి ట్రూ అప్ చార్జీలతో కలిపి బిల్లు వేశారు. ఈ హొటల్ కు మొత్తం రూ.21,48,62,224 కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో హోటల్ యజమాని షాక్ అయ్యాడు. గతనెలలోనూ 47 వేల 148 రూపాయల బిల్లు వచ్చిందంటూ హోటల్ యజమాని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటర్ లో సాంకేతిక లోపం ఉందని అధికారులు కొత్త మీటర్ బిగించారు. అయితే ఈసారి కోట్లలో బిల్లు వచ్చింది. ఈ విషయం అక్కడి ఏఈ దృష్టికి తీసుకెళ్లగా రీడింగ్ తీసి బిల్లును సరిదిద్దినట్లు వెల్లడించారు. 

Leave a Comment