పెళ్లయిన నెలకే భర్తకు హ్యాండిచ్చి.. ప్రియుడితో రెండో పెళ్లి..!

పెళ్లయిన నెల రోజులకే భర్తకు షాక్ ఇచ్చింది ఓ యువతి.. భర్తను కాదని తన ప్రియుడితో రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో సంచలనం రేపింది.. వివరాల మేరకు వేంగికాల్ గ్రామానికి చెందిన యువతికి అదే గ్రామానికి చెందిన తన బంధువుల యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. 

నెల రోజుల క్రితమే ఇద్దరికి పెళ్లి జరిపించారు. కానీ ఆ యువతి పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించింది. కానీ పెద్దలు మాత్రం ఆ యువతికి వేరే యువకుడితో పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఆ యువతి భర్తతో సరిగ్గా మాట్లాడకుండా మౌనంగా ఉంటూ వచ్చింది. అయితే మంగళవారం ఉదయం యువతి ఇంట్లో కనిపించకుండా పోయింది. 

యువతి ఆచూకీ కోసం భర్తతో పాటు బంధువులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆ యువతి తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో భర్తతో పాటు బంధువులు షాక్ అయ్యారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తమకు రక్షణ కల్పించాలని ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకోవాలని చెప్పి పంపించారు. 

Leave a Comment