ప్రభుత్వ ఆస్పత్రిలో ఐఏఎస్ అధికారిణి ప్రసవం..!

ఈరోజుల్లో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పోయింది. ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇక మహిళలు ప్రసవం అంటేనే ప్రభుత్వ ఆస్పత్రులు వద్దంటూ.. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ కాలంలోనూ ఓ ఐఏఎస్ అధికారిణి ఒకడుగు ముందుకేసింది.

 ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేందుకు.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా పరిషత్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎ.నందిని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలోనే నెలవారీ చికిత్సలు చేయించుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందుతుందని చాటిచెప్పారు. 

జిల్లా పరిషత్ సీఈవో నిందినికి ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమెకు సహజ ప్రసవం ద్వారా పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడ అధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు ఇదే రకమైన వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ ఇన్ చార్జి బసిరెడ్డి తెలిపారు. 

Leave a Comment