వింత ప్రేమకథ.. పదేళ్లుగా ప్రియుడి గదిలో ప్రేయసి..!

కేరళలోని పాలక్కడ్ జిల్లా అయిరూర్ లో ఓ వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. పదేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన ఓ యువతి(18) తన ప్రియుడితో కలిసి పదేళ్లుగా ఇంట్లోనే ఒక గదిలో ఉంటుంది. అయితే ఈ విషయం ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలియదు. విచిత్రం ఏంటంటే ఆమె తన తల్లిదండ్రులు ఉండే ఇంటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి దగ్గరే ఉన్నా ఎవరూ గుర్తించలేకపోయారు..

గత పదేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గదిలో ఆమె ఉంటోంది. ఆమె ప్రియుడే తన యోగక్షేమాలు చూసుకునేవాడు. ఆ గదికి బాత్రూం కూడా లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోడానికి ఓ కిటికీ నుంచి రాత్రిపూట ఆమె బయటకు వచ్చేది. పగలు ఆ కిటికీ కూడా మూసి ఉండేది. ఆమెకు ఆహారం, ఇతర సదుపాయాలన్నీ ప్రియుడే సమకూర్చేవాడు. ఒకటి రెండు కావు ఏకంగా పదేళ్లు మూడో వ్యక్తికి తెలియకుండా గుట్టుగా ఆ గదిలోనే ఉండిపోయింది. 

2010 ఫిబ్రవరిలో నెమారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుర్ నుంచి 18 సంవత్సరాల యువతి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. అయితే.. ఈ మధ్య ఈ విషయంపై అనుమానాలు రావడంతో మార్చి నెలలో ఇద్దరూ కలిసి అక్కడ నుంచి పారిపోయారు.

 దీంతో ఆ యువకుడి మీదనే అనుమానంతో దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తానికి ఇద్దరినీ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.  ప్రస్తుతం ఇద్దరూ వయసులో పెద్దవారే కావడంతో పాటు కలిసి బతుకుతామని కోర్టుకు చెప్పారు. దీంతో కోర్టే వీరిద్దరినీ కలిపింది. దీనికి ఇరు కుటుంబాలు కూడా అభ్యంతరం చెప్పలేదు.  

Leave a Comment