తొలిరాత్రే వధువుకు షాక్.. తాను ‘గే’ అని చెప్పిన వరుడు..!

ఎన్ఆర్ఐ సంబంధం అని  ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేశారు. రూ.10 లక్షలు కట్నం ఇచ్చారు. ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి పెళ్లి జరిపించారు. వివాహం జరిగిన తర్వాత కార్యం నిమిత్తం వధువును తీసుకెళ్లారు. ఎన్నో ఆశలతో శోభనం గదిలో అడుగుపెట్టిన ఆ నవ వధువుకు వరుడు షాక్ ఇచ్చాడు. తాను నపుంసకుడినని ఆమెతో చెప్పాడు. దీంతో షాక్ తిన్న ఆ యువతి మరుసటి రోజు తల్లిదండ్రులతో విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. 

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన 20 ఏళ్ల యువతికి విజయవాడ ఆటోనగర్ కు చెందిన ప్రైవేట్ కన్సల్టెన్సీలో పనిచేసే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4న పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత విదేశాల్లోనే స్థిరపతాడని అతని తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులతో చెప్పారు. 

ఫారిన్ సంబంధం అని మురిసిపోయిన యువతి తల్లిదండ్రులు రూ.10 లక్షల కట్నంతో పాటు లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఇచ్చి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగిన రోజు రాత్రే కార్యం నిమిత్తం వధువును విజయవాడ తీసుకెళ్లారు. తొలిరాత్రి గదిలోకి వెళ్లిన ఆమెకు భర్త తాను ‘గే’ అని, సంసారానికి పనికిరానని చెప్పాడు. 

ఈ విషయం చెప్పగానే యువతి కంగుతింది. తనకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదని, పెద్దల బలవంతానికే పెళ్లి చేసుకున్నానని, బయట ఎవరికీ చెప్పవద్దని కోరాడు. మరుసటి రోజు విజయవాడలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ లో తల్లిదండ్రులతో ఆ వధువు అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు రిసెప్షన్ రద్దు చేసుకుని తమ కూతురిని తీసుకుని వెళ్లిపోయారు. 

ఆ తర్వాత వరుడి కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేసి వధువు కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వధువు కుటుంబం అంగీకరించలేదు. దీంతో యువతి కుటుంబంపై దాడి చేశారు. పైగా రిసెప్షన్ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు చేశామని, వాటిని తిరిగి ఇవ్వాలని వరుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వరుడి కుటుంబ సభ్యులు అతడు గే అన్న విషయం దాచిపెట్టి తమ కూతురి జీవితం నాశనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment