ఐపీఎల్ కు సిద్ధం ఉండాలి : గంగూలీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అసోసియేషన్ లకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేఖ రాశాడు. ప్రేక్షలకు లేకుండా ఐపీఎల్ నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని గంగూలీ స్పష్టం చేశాడు. ఈ సీజన్ లో ఐపీఎల్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఆటగాళ్లంతా ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భారత మరియు విదేశీ ఆటగాళ్లు టోర్నీ ఆడతామని సంకేతాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. ఐపీఎల్ నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నాడు. 

అయితే ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ నిర్వహణకు సంబంధించి ఐసీసీ వాయిదా వేసింది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ప్రపంచకప్ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల వేచి చూడాలని నిర్ణయించింది. 2021లో మహిళల వన్డే వరల్డ్ కప్ ను షెడ్యూల్ ప్రకారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని ఐసీసీ తెలిపింది. 

Leave a Comment