యుద్ధానికి సిద్ధంగా ఉండండి : సైనికులకు జిన్ పింగ్ పిలుపు

యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, దేశానికి విధేయంగా పనిచేయాలని చైనా అధ్యక్షుడు జిగ్ పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. మంగళవారం గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న మిలిటరీ బేస్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 

అందరూ యుద్ధంపై దృష్టి కేంద్రీకరించాలని, శక్తిని కూడగట్టుకుని యుద్ధానికి సన్నధం కావాలని వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలు ఇండియాను ఉద్దేశించా లేదా అమెరికాను ఉద్దేశించి అన్నారో స్పష్టత రాలేదు. కాగా ప్రస్తుతం లాద్దాఖ్ లో భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈనేపథ్యంలో కచ్చితంగా భారత్ ను దృష్టిలో పెట్టుకునే జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.    

Leave a Comment