ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు 392 స్పెషల్ రైళ్లను నడపనుంది. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 42 ప్రత్యేక రైళ్లను తిప్పనుంది. ఈ రైళ్లలో వారినికి 2,3 రోజులు నడవనున్నాయి. మరి కొన్ని రోజూ, ఇంకొన్ని వీకెండ్స్ లో నడుస్తాయి. ఈనెల 20 నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య నారాయణాద్రి, గౌతమి, శబరి, చార్మినార్, బెంగళూరు, నర్సాపుర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ ధరలు సాధారణం కంటే 10 నుంచి 30 శాతం ఎక్కువగా ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు ఇవే..
- తిరుమల ఎక్స్ ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ ప్రెస్, గౌతమి ఎక్స్ ప్రెస్, నర్సాపుర్ ఎక్స్ ప్రెస్, చార్మినార్ ఎక్స్ ప్రెస్, శబరి ఎక్స్ ప్రెస్, బెంగళూరు ఎక్స్ ప్రెస్, హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయి.
- విశాఖపట్నం నుంచి విజయవాడ డబుల్ డెక్కర్ రైలు వారంలో ఐదు రోజులు నడుస్తుంది.
- రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైలు వారానికి మూడు రోజులు నడుస్తుంది.
- జైపూర్ ఎక్స్ ప్రెస్(వయా నాందేడ్), తిరుపతి-అమరావతి(మహారాష్ట్ర) రైళ్లు వారానికి రెండు రోజులు నడుస్తాయి.
- గౌహతి ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్-తిరుపతి(వయా విజయవాడ), విజయవాడ-హుబ్లీ ఎక్స్ ప్రెస్ వారానికి ఒక రోజు నడుస్తాయి. వీటితో పాటు మరికొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రా మీదుగా నడుస్తాయి.