ఏగుడు మీద యోగా చేస్తూ కిందపడిన బాబా రాందేవ్.. వీడియో వైరల్..!

బాబా రాందేవ్ అంటేనే గుర్తొచ్చేది యోగా.. యోగలో ప్రసిద్ధి చెందిన ఆయన చాలా మందికి యోగాసనాలు నేర్పించేందుకు శిబిరాలు నిర్వహిస్తుంటారు. కాని ఒక ఆశ్రమంలో ఏనుగు మీద కూర్చొని యోగా నేర్పిస్తూ బాబా రాందేవ్ కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆయనను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురలోని ఒక ఆశ్రమంలో బాబా రాందేశ్ యోగా క్యాంప్ నిర్వహించారు. అయితే అక్కడ ఒక ఏనుగు చక్కగా అలంకరించబడి ఉంది. దాన్ని చూసిన బాబా దాని మీద కూర్చొని యోగా నేర్పిస్తున్నాడు. అంతలో ఆ ఏనుగు అటూఇటు కదిలింది. దీంతో బాబా అదుపు తప్పి ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే లేచి సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆయనకు ఎలాంగి గాయలు కాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనూ సైకిల్ తొక్కుతూ బాబా రాందేవ్ కింద పడ్డ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.   

Leave a Comment