ఉదయం నిద్ర లేవగానే చేసే పొరపాట్లు ఇవే.. వీటిని అస్సలు చేయకండి..

రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి మార్నింగ్ నిద్రలేస్తే చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే మనకు తెలిసో .. తెలియకో ఉదయం నిద్రలేవగానే కొన్ని తప్పులు చేస్తుంటాం. ప్రస్తుతం చాలా మంది ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇది సహజంగా చేసే పొరపాటే.. అయితే ఇంకేం తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్రలేస్తేనే ఈ తప్పులు చేయవద్దు:

  • ఉదయం నిద్ర లేవగానే చాలా మంది బెడ్ మీదే కాఫీ, టీ తాగుతుంటారు. ఇలా అస్సలు చేయవద్దు. రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోం కాబట్టి కడుపు ఖాళీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో టీ, కాఫీ తీసుకోవడం వద్ద జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసిడిటీ వంటి సమస్యలకు కారణమవుతుంది. దీనికి బదులు మంచి నీళ్లు తాగాలి. లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రం అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. 
  • చాలా మంది నిద్ర లేచిన వెంటనే తమ ఫోన్లు చెక్ చేస్తుంటారు. అలా చేస్తే మనస్సు డిస్టర్బ్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఉదయం నిద్ర లేవగానే చీకట్లో కళ్లపై ఫోన్ వెలుతురు పడడం కూడా అంత మంచిది కాదు. కనుక నిద్ర లేవగానే ఫోన్ చూడకపోవడం మంచిది. 
  • ఉదయం నిద్రలేవగానే గబగబా పనులు చేస్తుంటారు. అలా చేయకుండా ముందుగా కాసేపు కాళ్లు, చేతులు కదిలిస్తూ వార్మప్ చేయాలి. ఇది చేయడంతో నిద్ర మత్తు పోవడంతో పాటు శరీరానికి కాస్త శక్తి కూడా వస్తుంది. 
  • ఉదయం నిదలేచిన తర్వాత కచ్చితంగా కనీసం 15 నిమిషాలు యోగా, లేదా 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇలి చేయడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు.  
  •  చాలా మంది ఉదయం ఆహారం తీసుకోవడం మానేస్తారు. ఉదయం చేసే పొరపాట్లలో ఇది కూడా ఒకటి. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల రోజులో మిగిలిన సమయాల్లో ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. దీంతో బరువు పెరుగుతారని నిపుణులు వెల్లడించారు. కచ్చితంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలి. 
  • ప్రతి రోజూ ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఆఫీస్, కాలేజీలకు సెలవని ఆలస్యంగా నిద్రలేవకూడదు. పనిఉన్నా లేకున్నా రోజూ ఒకేసమయానికి నిద్ర లేవాలి.

 

Leave a Comment