మరోసారి ‘CoronaVirus’ తో భయపెట్టిస్తున్న RGV..

‘ఇది ఒక మామూలు జ్వరమే..ఏ.. జలుబు నీకు రాలేదా..నాకు రాలేదా..’ అనుకునే వాళ్ల గుండెల్లో భయాన్ని తీసుకొచ్చాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాను ఏం చేసిన సంచలనమే అన్నట్లు ఇటీవల పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘Climax’ పేరిట హల్ చల్ చేశాడు. తాజాగా CoronaVirus తో ప్రజల్లో ఉన్న భయాన్ని సినిమా రూపంలో చూపిస్తున్నాడు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ CoronaVirus ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశాడు. ట్రైలర్ చూస్తేనే భయపడేలా ఉంది. 

కరోనా వైరస్ తో ప్రపంచం అల్లాడుతోంది. ఎన్నో లక్షల మంది కరోనాకు బలయ్యారు. భారత్ లోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో CoronaVirus చిత్రాన్ని తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. 

ఈ సినిమాను వర్మ తన స్టైల్లో తీశాడు. ఆవుట్ డోర్ షూటింగ్ కు వెళ్లకుండా కేవలం ఒక ఇంట్లో కుటుంబంలో లాక్ డౌన్ కారణంగా జరిగే పరిణామాలను చెప్పేలా ట్రైలర్ ఉంది. ఒక అమ్మాయి తీవ్రంగా దగ్గుతూ ఉంటే ఇంటి సభ్యులంగా ఆందోళన చెందుతుంటారు. ఆ అమ్మాయి దగ్గరగా వచ్చి కూర్చుంటే దూరంగా జరుగుతాడు సోదరుడు. అంతే కాక కరోనా వచ్చిందేమో అని సెటైర్ వేస్తాడు. ఆ సమయంలో తండ్రి ధైర్యాన్ని చెబుతాడు. మొత్తానికి కరోనా వైరస్ ట్రైలర్ తో ప్రజల్లో భయాన్ని తీసుకొచ్చాడు వర్మ. 

 

Leave a Comment