షాకింగ్ : చికెన్ లో కరోనా..!

చికెన్ లో కరోనా పాజిటివ్ వచ్చింది. అవును ఇది నిజమే..కోడి రెక్కల ముక్కలను టెస్టు చేయగా కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని దక్షిణ చైనాలోని షెంజన్ ప్రభుత్వం గురువారం వెల్లడించింది. అయితే ఈ చికెన్ బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. దిగుమతి చేసుకున్న చికెన్ ను సాధారణ పరీక్షల్లో భాగంగా మార్కెట్లో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన మాంసాన్ని గురువారం మార్కెట్ లో కొని తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి అధికారులు టెస్టులు చేశారు. అయితే వారికి కరోనా నెగిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. ఈ చికెన్ బ్రిజిల్ దక్షిణ ప్రాంతంలోని సాంతా కాటరీనా అనే ప్రాంతంలోని అరోరా అలిమెంటోస్ ప్లాంట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న సీఫుడ్ ప్యాకేజీల్లో కూడా కరోనా ఉన్నట్లు గుర్తించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.  

Leave a Comment