యాక్ తూ.. రోటి మీద ఉమ్మి వేసి కాలుస్తున్నాడు.. వీడియో వైరల్..!

కొన్ని ఘటనలు చూస్తే బయటి ఫుడ్ తినాలంటే జంకుతారు. అసలు ఏం వేసి వండుతున్నారో.. అసలు శుభ్రంగా ఉంటాయో లేదో తెలీదు. ఇక వంట వండేటప్పుడు కొందరు చేసే పనులు చూస్తే యాక్ అనాల్సిందే.. ఇటీవల పానీపూరి నీళ్లలో మూత్రం వేసిన సంగతి చూశాం కదా.. తాజాగా అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లో జరింది. తందూరి రోటీలు చేస్తున్న వ్యక్తి వాటి మీద ఉమ్మి తర్వాత కాలుస్తున్నాడు.. 

ఘజియాబాద్ లో రోడ్డు పక్కన ఉన్న దాబాలో ఓ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్నాడు. సాధారణంగా రోటీ చేసేటప్పుడు నూనె, నీరు వాడతారు. కానీ అతడు మాత్రం వాటి మీద ఉమ్మి తర్వాత రోటీని కాలుస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి.. అతడు చేసే నిర్వాకాన్ని వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దీంతో ఉమ్మి రోటీలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Leave a Comment