రాజ్యసభ స్థానాలకు నలుగురు నామినేషన్ 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం  ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలి ఇన్ ఛార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు బుధవారం నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు లు వరుసగా నామినేషన్ పత్రాలను అందజేశారు. వీరిలో పరిమళ్ నత్వానీ రెండు సెట్ల పత్రాలను అందించారు. వీరి నామినేషన్ పత్రాలను స్వీకరించిన అసెంబ్లీ కార్యదర్శి వారికి స్వీకరణ రశీదులను అందజేశారు. ఈనెల 16, 18 తేదిల్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. అదే రోజున అభ్యర్ధి లేదా ఆయన తరుపు సిఫార్సుదారుడు హాజరు కావచ్చన్నారు. తమ నామినేషన్ పత్రాలు పరిశీలన చేసుకొన్న అభ్యర్ధులు అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. అభ్యర్థుల వెంట రాష్ట్ర రాజకీయ, ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జునలతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. 

 

Leave a Comment