లవ్ స్టోరీ నుంచి ‘ఏ పిల్లా’ సాంగ్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఏ పిల్లా’ లిరికల్ సాంగ్ ను బుధవారం రిలీజ్ చేశారు. సాంగ్ చాలా ఫ్రెష్ గా ఉంది. క్లాసీ ట్యూన్ కి క్యాచీ లిరిక్స్ బాగున్నాయి. ఎక్కడా ఎలాంటి హడావుడి లేకుండా హాయిగా ఉంటుంది. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల, నాగ చతన్య కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా లవ్ స్టోరీ. ఫిదా సినిమాతో భారీ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం..

Leave a Comment