ఒకప్పటి టీమిండియా క్రికెటర్.. ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్త.. ఎవరో తెలుసా?

ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయ్యాడు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పనిచేస్తారని అందరికీ తెలిసిందే.. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ  పూర్తి చేయాలంటే అంత సాధారణం కాదు. తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి.. 

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆవిష్కార్ సాల్వి ఆస్ట్రోఫిజిక్స్ లో పీహెచ్డీ పూర్తి చేసి క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు. క్రికెట్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే సాల్వి మాత్రం తన పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. 

2003లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా సాల్వి అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యచ్ లో అతను 2 వికెట్లు పడగొట్టాడు. అయితే కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అయితే మాజీ క్రికెటర్లలో కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. వారందరికంటే అత్యున్నత విద్యను అభ్యసించిన సాల్వి ‘ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్’ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 

Leave a Comment