ప్రధాని మోడీకి ఆలయం..!

దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ బీజేపీ కార్యకర్త ఆలయం నిర్మించాడు. ఆలయంలో నరేంద్ర మోడీ విగ్రహం ఏర్పాటు చేసి రోజూ పూజిస్తున్నాడు. ఇంతకు ఈ ఆలయం ఎక్కడ ఉందంటే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన 37 ఏళ్ల మయూర్ యుండేకు ప్రధాని మోడీ అంటే ఎంతో అభిమానం..

ఆ అభిమానం కాస్త భక్తిగా మారింది. దీంతో మయూర్ తాను నివసిస్తున్న అనుద్ ప్రాంతంలో రూ.1.5 లక్షల ఖర్చుతో ఆలయాన్ని నిర్మించాడు. ఆరు అడుగుల ఎత్తులో ఆలయం నిర్మించి అందులో ప్రధాని మోడీ విగ్రహాన్ని నెలకొల్పాడు. 

ఈ ఆలయాన్ని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ప్రారంభించాడు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఎర్రరాతిని జైపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. విగ్రహ రక్షణ కోసం ప్రత్యేకంగా అద్దం ఏర్పాటు చేశారు. ఈ ఆలయం పక్కనే ఓ పెద్ద శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకంలో మోడీ గురించి మయూర్ స్వయంగా ఓ పద్యాన్ని రాసి ఉంచారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోడీ అభిమానులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 

Leave a Comment