మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత..!

కరోనా బారినపడిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం కన్నుమూశారు. కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో గతకొంత కాలంగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం విషమించిన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రకటించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 

ప్రణబ్ ముఖర్జీ జీవిత చరిత్ర

  • ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్‌లో జన్మిచారు. 
  • 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
  • 1969 మిడ్నాపూర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం 
  • 34 ఏళ్లకే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ప్రణబ్ ముఖర్జీ 
  • 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎంపిక 
  • నాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మినబంటుగా పేరుబడ్డ ప్రణబ్
  •  1975,1981,1993,1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ 
  • 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన ప్రణబ్ 
  • 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక కావడంతో కీలకపాత్ర 
  • 2004లో తొలిసారి లోక్ సభకు ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ 
  •  2004 నుంచి 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో నెంబర్ 2గా గుర్తింపు
  •  కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు నిర్వహించిన ప్రణబ్ 
  • ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా ప్రణబ్ ను గుర్తించిన యూరోమనీ 
  • 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అందుకున్న ప్రణబ్ 
  •  2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ 

 

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ వేత్త మాత్రమే కాదు.. ఆయన మంచి రచయిత కూడా..ఆయన పలు పుస్తకాలను రాశారు. 1987లో ఆఫ్ ది ట్రాక్ అనే పుస్తాకాన్ని రాశారు. 1992లో సాగా ఆప్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్, ఛాలెంజెస్ బిఫోర్ ది నేషన్ అనే పుస్తకాలన రచించారు. 2014లో ది డ్రమాటిక్ డెకేడ్-ది డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్ అనే పుస్తకాన్ని రచించారు. 

Leave a Comment