కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి మృతి..!

కరోనా రాజకీయ నాయకుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు కరోనాతో మరణించారు. తాజాగా టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి(69) కన్నుమూశారు. 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ఈనెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. మూడు రోజులపాటు సబ్బం హరి హోం క్వారంటైన్ లో ఉన్నారు. అనంతరం వైద్యుల సలహా మేరకు ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయన పలు ఇన్ఫెక్షన్లు సోకండంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.  

చంద్రబాబు సంతాపం..

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సబ్బంహరి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని, కానీ ఇంతలోనే ఇలాంటి వార్తను వినాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Leave a Comment