పీటల మీద రెండో ఎక్కం అడిగిన వధువు.. చెప్పలేదని పెళ్లి క్యాన్సిల్..!

వరుడు నిరక్షరాస్యుడు కావడంతో పీటల మీద పెళ్లిని ఆపు చేయించింది ఓ వధువు.. ఉత్తరప్రదేశ్ కు చెందిన విద్యావంతురాలైన యువతికి ఇటీవల మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెద్దలు పెళ్లి నిశ్చియించారు. శనివారం సాయంత్రం అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. పురోహితుడు పెళ్లి తంతు మొదలుపెట్టాడు..

అయితే పురోహితుడు చెబుతున్న మంత్రాలను పెళ్లి కొడుకు తిరిగి చెప్పడంలో తడబాటు పడ్డాడు. దీంతో వధువుకు అనుమానం వచ్చింది. మంత్రాలు ఆపుచేయించి పెళ్లి కొడుకును మీరెంత వరకు చదువారు అంటూ ప్రశ్నించింది. దీంతో అతను నీళ్లు నమిలాడు.. పెళ్లికి కొన్ని క్షణాల ముందు కాబోయే భర్తకు టెస్ట్ పెట్టింది. 

రెండో ఎక్కం అప్పచెప్పాలని వరుడును అడిగింది. అంతే రెండో ఎక్కం అప్పచెప్పడంతో వరుడు తడబడ్డాడు.. రెండు.. రెండు .. ఆరు అంటూ నీళ్లు మింగాడు. దీంతో ఆగ్రహం చెందిన వధువు నిరక్షరాస్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పేసింది. ఇరువైపు పెద్దలు ఆమెకు సర్ది చెప్పాలని చూసినా.. ఆమె ఒప్పుకోలేదు. రెండో ఎక్కం చెప్పడం రానివాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి రద్దు చేసుకున్నారు. 

  

 

Leave a Comment