ఏపీలో ఎల్లుండి నుంచి కర్ఫ్యూ.. 6 నుంచి 12 వరకు మాత్రమే అనుమతి..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈనెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. 

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కూడా 144 సెక్షన్ అమలుకానుంది. రెండు వారాల పాటు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం జగన్ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను సీఎం జగన్ ఆదేశించారు.  

Leave a Comment